Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నరసరావుపేటలో క్లినిక్ పెట్టి.. కొద్దిరోజుల్లోనే మంచి సర్జన్‌గా ప్రజల మన్ననలు పొందారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు

tdp senior leader kodela siva prasad rao life storya
Author
Guntur, First Published Sep 16, 2019, 1:26 PM IST

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూయడంతో పల్నాడు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఆయనను పల్నాటి పులిగా పిలుచుకుంటారు.

కోడెల లేరనే వార్త తెలియగానే జనం కన్నీరుమున్నీరవుతున్నారు.  1947 మే 2వ తేదీన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు కోడెల జన్మించారు.

ఐదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివిన ఆయన.. విజయవాడలోని లయోల కాలేజీలో పీయూసీ పూర్తిచేశారు. తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడంతో డాక్టర్ కావాలని శివప్రసాద్ నిర్ణయించుకున్నారు.

గుంటూరు ఏసీ కాలేజీలో మళ్లీ పీయూసీ చదివి కర్నూలు మెడికల్ కాలేజీలో చేరారు. రెండున్నరేళ్ల తర్వాత గుంటూరుకు వచ్చి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం వారణాసిలో ఎంఎస్ చదివారు. నరసరావుపేటలో క్లినిక్ పెట్టి.. కొద్దిరోజుల్లోనే మంచి సర్జన్‌గా ప్రజల మన్ననలు పొందారు.

ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 85, 89, 94, 99 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో హోమ్ శాఖ మంత్రిగా, చంద్రబాబు మంత్రివర్గంలో జలవనరులు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు.

2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన కోడెల.. అనంతరం 2014లో విజయం సాధించి నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా రికార్డుల్లోకి ఎక్కారు.

2019 ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో పాటు కే ట్యాక్స్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో శివప్రసాద్ టీడీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ముగ్గురు పిల్లలు కూడా వైద్య వృత్తిలోనే కొనసాగడం గమనార్హం.

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios