హైదరాబాద్: తన తండ్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనయురాలు విజయలక్ష్మీ. 
ఈరోజు తమ కుటుంబంలో జరిగిన ఘటన ఎవరికీ జరగకూడదన్నారు. 

తన తండ్రిని కేసులతో వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి తమ తండ్రిని, తమ కుటుంబ సభ్యులను కేసులతో నిత్యం వేధించారని ఆరోపించారు. 

తండ్రి లేకపోతే కొడుకు అదీ కాకపోతే తాను ఇలా నిత్యం మీడియాలో చూపిస్తూ నరకం చూపించారని ఆరోపించారు. మూడున్నర నెలలుగా తన తండ్రి కోడెల శివప్రసాదరావును కంటిమీద కునుకు లేకుండా వేధించారని ఆరోపించారు. 

రాజకీయాల్లో సీనియర్ నాయకుడు అయిన కోడెలను కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వేధించారని మండిపడ్డారు. చనిపోయిన తర్వాత కూడా తమ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. 

రకరకాల ఊహాగానాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అందువల్లే తాను బయటకు వచ్చి ఇలావ వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తమ కుటుంబాన్ని వదిలెయ్యాలంటూ వేడుకున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు విజయలక్ష్మీ. 

తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. తమ మధ్య ఎలాంటి ఆస్తి గొడవలకు కూడా లేవన్నారు. తన తండ్రి అంటే తమకు ఎంతో ప్రాణమన్నారు. తండ్రి చాటు పిల్లల్లా తాము బతికామన్నారు. కనీసం ఇప్పుడైనా తమ బతుకులు తాము బతకనివ్వాలని విజయలక్ష్మీ కన్నీటి పర్యంతమయ్యారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య