Asianet News TeluguAsianet News Telugu

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

దివంగత సీఎం ఎన్టీఆర్ ను సైతం ఇలాగే వెన్నుపోటు పొడిచి శవరాజకీయాలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆనాడు ఎన్టీఆర్ నిన్న హరికృష్ణ నేడు కోడెల శివప్రసాదరావు ఇలా ఎంతోమందిని మానసికంగా వేధించింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు.

ap minister kodali nani sensationa comments on tdp president chandrababu over kodela suicide
Author
Amaravathi, First Published Sep 17, 2019, 1:11 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మంత్రి కొడాలి నాని. మనుషులను పద్దతి ప్రకారం మానసికంగా చంపి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు. 

పల్నాటి పులి అయిన కోడెల శివప్రసాదరావుని జిత్తులుమారి నక్క అయిన చంద్రబాబు నాయుడు నక్క వినయాలతో చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు దూరం పెట్టడంతోనే కోడెల చనిపోయాడని ఆరోపించారు. కోడెలను మెుదటి నుంచి వేధిస్తున్న చంద్రబాబు చివరకు ఇలా వదిలించుకున్నారంటూ మండిపడ్డారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ ను సైతం ఇలాగే వెన్నుపోటు పొడిచి శవరాజకీయాలు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆనాడు ఎన్టీఆర్ నిన్న హరికృష్ణ నేడు కోడెల శివప్రసాదరావు ఇలా ఎంతోమందిని మానసికంగా వేధించింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు.

దివంగత సీఎం ఎన్టీఆర్ ను గొప్పగా పొగిడి అనంతరం ఆయనను పదవి నుంచి దించేసి ఆయన చావుకు కారణమైంది చంద్రబాబు నాయుడేనని అందరికీ తెలుసునన్నారు. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు శవం పక్కనే కూర్చుని దొంగ ఏడుపులు ఏడ్చి రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, అభివృద్ధి ఆగిపోతుందంటూ నానా హంగామా చేసి శవయాత్రలో పాల్గొంది చంద్రబాబు నాయుడేనన్నారు. 

తన తండ్రి ఎన్టీఆర్ ఎలా చనిపోయారో తెలియాలంటూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఆయన తనయుడు దివంగత నేత నందమూరి హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేస్తే సీబీఐ విచారణ ఎందుకు వేయలేదో అందరికీ తెలుసునన్నారు. ఆ తర్వాత హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా పార్టీ నుంచి వెళ్లగొట్టవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని. 

హరికృష్ణ రోడ్డుప్రమాదంలో చనిపోయిన తర్వాత వెంటనే పక్కన చేరిపోయారంటూ మండిపడ్డారు. హరికృష్ణ శవయాత్రలో హరికృష్ణ పార్థీవ దేహం కంటే చంద్రబాబే ఎక్కువ కనిపించారని మండిపడ్డారు. అంతేకాదు మెుసలి కన్నీరు కారుస్తూ లబ్ధిపొందాలని ప్రయత్నించారంటూ తిట్టిపోశారు.   

ప్రస్తుతం కోడెల శివప్రసాదరావు విషయంలో కూడా అలానే చంద్రబాబు నాయుడు వ్యవహరించారని ఆరోపించారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఏనాడు చంద్రబాబు మాట్లాడలేదని కోడెల శివప్రసాదరావే బయటకు వచ్చి ఆయనే సమాధానం ఇవ్వాల్సిన దుస్థితి తీసుకువచ్చారని ఆరోపించారు. 

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న నాలుగు గంటల వరకు చంద్రబాబు నాయుడు నోరు విప్పలేదన్నారు. పోలీసుల కోడెల గదిని తనిఖీ చేసి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిసిన తర్వాత పల్నాటి పులి అంటూ మెుసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios