MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

HIV - Andhra Pradesh:హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. అయితే, బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.  

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 01 2024, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
hiv

hiv

HIV - Andhra Pradesh:హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా డిసెంబర్‌ 1న 'ప్రపంచ ఎయిడ్స్‌ దినం'గా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక కొత్త నినాదంతో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం  "హక్కుల మార్గాన్ని అనుసరించడం - నా ఆరోగ్యం, నా హక్కు" నేపథ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

హెచ్‌ఐవీ రోగుల్లో రెండ్ స్థానంలో ఆంధ్రప్రదేశ్..మహిళలే అధికం 

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 నాటికి 2,22,338 మంది హెచ్‌ఐవీ రోగులు 'నేషనల్‌ ఎయిడ్స్‌ అండ్‌ ఎస్‌టీడీ కంట్రోల్‌ ప్రోగ్రాం' కింద చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బాధితుల్లో మహిళల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉంది. మొత్తం 1,22,124 మంది మహిళలు హెచ్‌ఐవీ చికిత్స పొందుతున్నారు. పురుషుల సంఖ్య 99,455 కాగా, థర్డ్‌జెండర్లు 759 మంది.

ఆంధ్ర రాష్ట్రంలో, 2019-20లో నమోదైన హెచ్‌ఐవీ రోగుల సంఖ్య 1,92,693 కాగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 2,22,338కు, అంటే 15.38% పెరిగింది. వీరిలో 90% మంది 15-49 సంవత్సరాలు మధ్య వయస్సు వారే. దాదాపు 90% మందికి సురక్షితంకాని లైంగిక సంబంధాల కారణంగానే హెచ్‌ఐవీ సోకుతోంది. గుంటూరు. తూర్పు గోదావరి ,కృష్ణ, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
World Aids Day

World Aids Day

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కోసం ఏపీ సర్కారు చర్యలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కోసం విస్తృత చర్యలు చేపట్టింది. సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, సూదుల ద్వారా మాదకద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు, వలస కార్మికులకు హెచ్‌ఐవీ సోకే అవకాశాలు ఎక్కువ ఉన్నందున, వారిలో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. దాదాపు 2 లక్షల మంది ఈ సేవలు అందుకుంటున్నారు. మన రాష్ట్రంలో మొత్తం 2,181 హెచ్ఐవీ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. దాదాపు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా హెచ్‌ఐవీ నిర్ధరణ పరీక్షలు చేస్తున్నారు. హెచ్‌ఐవీ సోకిందని తెలియగానే ఏఆర్‌టీ చికిత్స మొదలు పెడుతున్నారు.

36

హెచ్‌ఐవీ రోగులకు అవసరమైన మందులను 60 ఏఆర్‌టీ కేంద్రాలు, 161 లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. బాధితుల ఆర్థిక సంక్షేమం కోసం ప్రభుత్వం పింఛను కూడా ఇస్తోంది. హెచ్‌ఐవీ రోగుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు కాబట్టి, అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా నిర్భయంగా పరీక్షలు చేయించుకోవచ్చు.

హెచ్‌ఐవీ బాధితులకు ఆర్థికరాష్ట్ర‌వ్యాప్తంగా  ఉన్న ఏఆర్‌టీ, లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా మందులు, పరీక్షలు, సలహాలు అందిస్తున్నారు.  హెచ్‌ఐవీ బాధితులకు సామాజిక చికిత్స అందించడానికి కౌన్సెలింగ్ సెషన్‌లు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితులకు హెపటైటిస్‌ వ్యాక్సిన్ ఇస్తున్నారు. ట్రాన్స్‌జెండర్‌లకు వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించడానికి ప్రత్యేక కేంద్రాల్ని ఏర్పాటు చేశారు.

46

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ

ప్రజల్లో సుఖవ్యాధుల నియంత్రణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 55 ప్రత్యేక సురక్ష క్లినిక్‌లను అందుబాటులో ఉంచింది. ప్రజలకు సురక్షితమైన రక్తం సరఫరా చేయడానికి 227 బ్లడ్‌ బ్యాంక్‌లు, 156 రక్త నిధి కేంద్రాల్ని నెల‌కొల్పింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ గురించి అవగాహన పెంచడానికి విస్తృతమైన కార్యక్రమాల్ని ఎపిశాక్స్ నిర్వ‌హిస్తోంది. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా హెచ్‌ఐవీ బాధితులకు సకాలంలో వైద్యం అందుతోంది. ప్రజల్లో హెచ్‌ఐవీ గురించి అవగాహన పెరిగింది. హెచ్‌ఐవీ బాధితులపై సామాజిక వివక్ష తగ్గింది. 

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ (APSACS), 'ప్రపంచ ఎయిడ్స్‌ దినం' సందర్భంగా విజయవాడలో ఆదివారం ఉదయం 8 గంటలకు  భారీ ర్యాలీ చేపట్టింది. అనంతరం  తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేసింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

56

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కోసం 'మీకు తెలుసా' కార్యక్రమం 
 
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి నవంబరు 12 వరకు "మీకు తెలుసా?" పేరిట ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగాన్ని ఇందులో భాగస్వామ్యం చేశారు. పట్టణాలు, గ్రామాల్లో, ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా, యువత స్థాయి నుంచే హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. దీంతోపాటు, నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఏసీవో) మద్దతుతో, ఏపీఎస్‌ఏసీఎస్‌ "యూత్‌ఫెస్ట్‌ 2024-2025" మారథాన్‌ కూడా నిర్వహించింది.

స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్‌జెండర్‌లను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యవంతం చేశారు. లింగ సమానత్వాన్ని చాటేలా, ఈ మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయిలో విజేతలను జాతీయ స్థాయి మారథాన్‌కు ఎంపిక చేశారు. 9, 11 తరగతుల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు కూడా నిర్వహించారు.

66

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌  ఒకటి కాదు

చాలామంది ప్రజలు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ ఒకటే అనుకుంటున్నారు. అది నిజం కాదు. హెచ్‌ఐవీ అంటే "హ్యూమన్ ఇమ్యునో డెఫిసియన్సీ వైరస్‌". ఈ సూక్ష్మక్రిమి మానవ శరీరంలో ప్రవేశించి, శరీరంలోనే వృద్ధి చెంది, రోగ నిరోధక శక్తిని క్రమేణా నాశనం చేస్తుంది. ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం క్రమంగా క్షీణించి అనేక వ్యాధుల బారిన పడతారు. ఎయిడ్స్ (AIDS) అంటే, "అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిసియన్సీ సిండ్రోమ్‌".

హెచ్‌ఐవీ మానవ శరీరంలో వృద్ధి చెందాక, రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఏర్పడే అనారోగ్య పరిస్థితి ఇది. హెచ్‌ఐవీ ఉన్న అందరూ ఎయిడ్స్‌ రోగులు కాదు. హెచ్‌ఐవీ నుంచి ఎయిడ్స్‌ దశలోకి మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. హెచ్‌ఐవీ సోకినప్పటికీ, బలవర్ధకరమైన ఆహారం, క్రమం తప్పని చికిత్స, వ్యాయామాలతో చాలా ఏళ్లపాటు సాధారణ ప్రజల్లాగే ఆరోగ్యంగా జీవించవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఆరోగ్యం
పవన్ కళ్యాణ్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. ఏకంగా 10 వేల‌కిపైగా ఉద్యోగాల భ‌ర్తీ
Recommended image2
School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?
Recommended image3
Heavy Rain Alert : ఒకేసారి అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు... మరి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల సంగతేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved