Asianet News TeluguAsianet News Telugu

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం


కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై 306 కేసు నమోదు చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాను రిక్వస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 
 

ap minister kodali nani sensational comments on  chandrababu naidu over kodela death
Author
Amaravathi, First Published Sep 17, 2019, 12:23 PM IST

అమరావతి: మాజీ శాసన సభస్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు పట్నాటి పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడే కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుపై 306 కేసు నమోదు చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాను రిక్వస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. 

కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో చంద్రబాబు నాయుడును విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడును ఏవన్ కింద కేసు నమోదు చేసి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నక్కజిత్తులు, శవరాజకీయాలు ప్రజలందరికీ తెలుసునన్నారు. 

 కోడెల శివప్రసాదరావుపై వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కేసులు పెట్టలేదన్నారు. పోలీసులు సైతం కోడెలను ఏనాడు వేధించలేదని చెప్పుకొచ్చారు. కోడెలపై 40 మంది బాధితులే కేసులు పెట్టారని వాటికి ప్రభుత్వానికి ఏం సంబంధం అని నిలదీశారు. 
 
కుటుంబ సభ్యులు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూరం పెట్టడంతో తట్టుకోలేక మృతి చెందాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాదరావును ఎలా వదిలించుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపించారు. 
 
కోడెల శివప్రసాదరావుపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించారన్నారు. పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన కోడెలను చంద్రబాబు నాయుడు దూరం పెట్టి వేధించింది వాస్తవం కాదా అని నిలదీశారు. 

కోడెల నరసరావుపేట టికెట్ అడిగితే సత్తెనపల్లి టికెట్ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఇటీవల కాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కోడెలకు వ్యతిరేకంగా గ్రూపు నడిపిస్తోంది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు.   

స్పీకర్ పదవికి అవమానం తెచ్చేలా చంద్రబాబు నాయుడు కోడెలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన కోడెలను మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవికి పరిమితం చేసి ఆయన్ను వదిలించుకునే ప్రయత్నం చేశారంటూ ధ్వజమెత్తారు. 

ఇకపోతే పార్టీ పరంగా కూడా కోడెల శివప్రసాదరావును చంద్రబాబు నాయుడు దూరం పెట్టారని ఆరోపించారు. పల్నాడులో వైసీపీ బాధితుల శిబిరం పెట్టి పల్నాటి పులి అంటున్న కోడెలను ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని నిలదీశారు. కోడెల శివప్రసాదరావు వస్తున్నా ఎందుకు చంద్రబాబు అడ్డంపడ్డారో చెప్పాలని నిలదీశారు. 

కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ప్రభుత్వం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము అడ్డుకోబోమని చెప్పింది వాస్తవం కాదా అంటూ  చెప్పుకొచ్చారు. కోడెల సత్తెనపల్లి వెళ్తే పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగేలా చేసింది చంద్రబాబు కుట్ర కాదా అని నిలదీశారు.అప్పుడు పార్టీ అధినేతగా ఉండి గుడ్డిగుర్రం పళ్లు తోమావా అంటూ మండిపడ్డారు.

కోడెల శివప్రసాదరావును మెుదటి నుంచి అవమానించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. కోడెల శివప్రసాదరావు ఇంట్లో బాంబులు పేలిన ఘటనలో కేసు కట్టి కోర్టులో వేధింపులకు గురిచేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

1999లో మంత్రి పదవి ఇవ్వకుండా కోడెలను పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 2014లో సత్తెనపల్లి వద్దు నరసరావుపేట టికెట్ కావాలని కోడెల అడిగినా కూడా సత్తెనపల్లి ఇచ్చి అవమానించారన్నారు. 

23 మంది వైసీపీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరితే వారిపై అనర్హత వేటు వేయకుండా ఆయనను స్పీకర్ గా చంపేసింది చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. కోడెల శివప్రసాదరావు తనయుడును అడ్డుపెట్టుకుని మాజీమంత్రి నారా లోకేష్ కమీషన్లు వసూలు చేసింది నిజం కాదా అని నిలిపించారు. 

 గత పదిరోజులుగా చంద్రబాబు నాయుడును కలిసేందుకు కోడెల శివప్రసాదరావు ప్రయత్నిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కలుద్దామని చెప్పి ఒకసారి తప్పించుకున్న చంద్రబాబు తీరా హైదరాబాద్ వస్తే బిజీగా ఉన్నా మంగళవారం కలుద్దామని చెప్పి ఉదయమే అక్కడ నుంచి విజయవాడ వచ్చింది వాస్తవం కాదా అని నిలదీశారు.

చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే లోపు కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నది నిజం కాదా అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. బతికి ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వని చంద్రబాబు చనిపోయిన తర్వాత శవంపక్కన కూర్చుని మెుసలి కన్నీరు కారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

శవాలపై పేలాలు వేరుకునే వాడిలా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మనిషిని ఎలా వాడుకోవాలో ఎలా వదిలించుకోవాలో చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు నాయుడే కారణమని పల్నాటి ప్రజలకు తెలుసునని ఇక నాటకాలు ఆపాలంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

Follow Us:
Download App:
  • android
  • ios