సైనికులకు, మోదీకి సెల్యూట్: దగ్గుబాటి పురందేశ్వరి | Operation Sindoor | Asianet News Telugu

Share this Video

ఆపరేషన్ సిందూర్ విజయానికి మద్దతుగా విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు జాతీయ జెండా చేతబూని రెపరెపలాడిస్తూ సూమారు మూడు కిలోమీటర్లు నడిచారు. ఆద్యంతం జాతీయ భావం వెల్లివిరియగా.. వేలాది మంది నగర ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొని భారత సైన్యం తాలూకు శౌర్యాన్ని కీర్తించారు. భారత్ మాతా కీ జై అని నినదిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముందుకి కదలగా.. వేలాది మంది జాతీయ పతాకాలు చేతబూని వారిని అనుసరించారు. బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ ముగిసిన అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు.

Related Video