Asianet News TeluguAsianet News Telugu

తల్లికి చెల్లికి తేడాతెలియని కుక్క ఆ మంత్రి... వాడిని చెప్పుతో కొట్టాలి : షర్మిల ఫైర్

మహబూబ్ నగర్ : తనను మరదలంటూ అవమానకరంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క అంటూ వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు.

First Published Sep 20, 2022, 3:04 PM IST | Last Updated Sep 20, 2022, 3:04 PM IST

మహబూబ్ నగర్ : తనను మరదలంటూ అవమానకరంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి ఓ వీధి కుక్క అంటూ వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. నీతిమాలిన ఈ మంత్రి తల్లికీ, చెల్లికి తేడా తెలియనివాడు... పరాయి స్త్రీలో తల్లినో, చెల్లినో చూడాలన్న ఇంగితం లేని ఇతడికీ వీధి కుక్కకి తేడా లేదంటూ విరుచుకుపడ్డారు. మరదలు అని ఏ ఆడబిడ్డనైనా అంటే చెప్పుతో కొడుతుంది... అదే కరెక్ట్ అని షర్మిల అన్నారు. 

ఉమ్మడి పాలమూరు జల్లా ఎమ్మెల్యేలంతా వెళ్లి స్పీకర్ కు ఫిర్యాదు చేసారని... దీంతో తనను అరెస్ట్ చేస్తారని, అసెంబ్లీకి పిలిచి వివరణ కోరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోందని షర్మిల గుర్తుచేసారు. దమ్ముంటే తనను అసెంబ్లీకి రమ్మనండి... నడుచుకుంటూ వస్తా... కాలి నడకన వస్తా... తలెత్తుకొని వస్తా...ఎప్పుడు రమ్మంటారో చెప్పండని అన్నారు. మీరు డేట్ ఇస్తారా...నన్ను డేట్ తీ సుకోమంటారా..? అసెంబ్లీ లోపలకు రావాలా...అసెంబ్లీ ముందుకు రావాలా? అసెంబ్లీ ముందు కూర్చొని పబ్లిక్ గా మాట్లాడుతా... ఏం అడుగుతారో అడగండి అని షర్మిల స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.