ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించాల్సిందే.. కరోనాపై రంగంలో అమ్మవారు..

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టం రంగం... అత్యంత ఆసక్తిగా జరిగింది. 

First Published Jul 14, 2020, 12:14 PM IST | Last Updated Jul 14, 2020, 12:14 PM IST

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టం రంగం... అత్యంత ఆసక్తిగా జరిగింది. ఈసారి కరోనా వైరస్ గురించి అమ్మవారిని అడిగారు. ఈ వైరస్ ఎన్నాళ్లు ఉంటుంది? ఎప్పుడు పోతుంది? ప్రజలు ఏం చెయ్యాలి? అనే అడిగితే... అమ్మవారు చెప్పిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. "ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదు" అన్న అమ్మవారు... ఓ అమ్మగా తాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నా... అంతకు మించి ప్రజలు ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రజలు కష్టాలు పడుతుంటే... తాను సంతోషంగా లేనన్న అమ్మవారు... తాను ప్రజలను కాపాడతానని అన్నారు. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అమ్మవారు. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవన్న ఆమె... ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను వారిని కాపాడతానని అన్నారు. ఐదు వారాలపాటూ తనను పూజించాలనీ, యజ్ఞహోమాలు జరిపించాలని రంగంలో అమ్మవారు కోరారు.