గ్రామ గ్రామాన చావుడప్పుతో టీఆర్ఎస్ నిరసన... నిర్మల్, మహబూబాబాద్ లో మంత్రుల నిరసన
హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కేంద్రలో అధికార బిజెపి పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీరును తప్పుబడుతూ ఇప్పటికే వివిధ రూపాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేసింది. తాజాగా ఇవాళ(సోమవారం) మరోసారి నిరసనలకు పిలుపునిచ్చింది. వరి ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గ్రామాల్లో చావు డప్పుతో నిరసన తెలియజేయాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చింది. అదిష్టానం పిలుపుతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనబాట పట్టారు. నిర్మల్ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి.