Asianet News TeluguAsianet News Telugu

డిల్లి లిక్కర్ స్కాం...నన్ను జైల్లో పెడతారు అంతేగా..!: ఎమ్మెల్సీ కవిత సంచలనం

హైదరాబాద్ :  డిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్ లో తన పేరును ప్రస్తావించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

First Published Dec 1, 2022, 10:58 AM IST | Last Updated Dec 1, 2022, 10:58 AM IST

హైదరాబాద్ :  డిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్ట్ లో తన పేరును ప్రస్తావించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు పూర్తయిందని... ఈ సమయంలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికయిన తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చారని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో తెలంగాణలోనూ ఎన్నికలు వున్నాయి కాబట్టి మోడీ కంటే ముందే ఈడీ వచ్చిందన్నారు. తనపైనే కాదు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కూడా ఈడి, సిబిఐ కేసులు పెడుతూ బిజెపి హీనమైన, నీచమైన రాజకీయాలు చేస్తోందన్నారు. ఎటువంటి విచారణనైనా ఎదుర్కొంటామని... ఏజన్సీలు వచ్చి ప్రశ్నిస్తే తప్పకుండా జవాబు చెబుతామని అన్నారు. ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదు...
జైల్లో పెట్టడం కంటే ఎక్కువ చేసేది ఏమి లేదని కవిత అన్నారు.మీడియాలో లీకులు ఇచ్చి నాయకుల మంచిపేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిప్పికొడతారని కవిత హెచ్చరించారు. ప్రధాని మోదీని ఈ రాజకీయ పంథాను మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని కవిత అన్నారు. ప్రజలకు ఏం చేసామో చెప్పి  గెలవాలి కానీ ఈడి, సిబిఐ లను ఉపయోగించుకుని గెలవాలనుకోవడం దారుణమన్నారు. అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో మీకిది సాధ్యపడదని కవిత పేర్కొన్నారు.