సీఎల్పీ కాళేశ్వరం పర్యటనలో ఉద్రిక్తత... స్ఫృహతప్పి రోడ్డుపై పడిపోయిన భట్టి విక్రమార్క

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిని సీఎల్పీ బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన ఉద్రిక్తతంగా మారింది.

First Published Aug 17, 2022, 5:37 PM IST | Last Updated Aug 17, 2022, 5:37 PM IST

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిని సీఎల్పీ బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఈ ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరిన సిఎల్పీ బృందాన్ని భూపాలపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. ముందే సమాచారమిచ్చినా తమను పోలీసులు అడ్డుకోవడమే కాదు దురుసుగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.  144 సెక్షన్ అమల్లో వుందంటూ పోలీసులు అరెస్ట్ లకు సిద్దమవగా కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల్లో భట్టి విక్రమార్క సొమ్మసిల్లి పడిపోయారు.