గ్రీన్ ఇండియా ఛాలెంజ్... సిబిఐ మాజీ జేడితో కలిసి మొక్కలు నాటిన శంకర్ మహదేవన్

హైదరాబాద్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. 

First Published Aug 22, 2022, 3:50 PM IST | Last Updated Aug 22, 2022, 3:50 PM IST

 హైదరాబాద్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం కోసం హైదరాబాద్ కు వచ్చిన శంకర్ మహదేవన్ మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ, స్నేహితుడు రాజుతో కలిసి బేగంపేటలో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రవేశపెట్టిన గ్రీస్ ఇండియా  ఛాలెంజ్ లో పాల్గొనడం ఆనందంగా వుందన్నారు శంకర్ మహదేవన్. మొక్కలు ప్రాణవాయువకు ఆక్సిజన్ ను అందించడమే కాదు వాటి ఆకుల సవ్వడి, గాలి శబ్దం అద్భుతమైన సహజసిద్ద సంగీతాన్ని సృష్టిస్తుందని శంకర్ మహదేవన్ పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, గాయని శ్రేయా ఘోషల్, వాయిద్యకారుడు శివమణి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని మహదేవన్ ఛాలెంజ్ విసిరారు.