Asianet News TeluguAsianet News Telugu

రామగుండం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి... ఘటనాస్థలంలో కిలో బంగారం

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్  మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.  దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.   

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంబారిన పడినవారు బంగారు వ్యాపారులుగా గుర్తించారు. సంఘటన స్థలంలో  కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు ఆంద్రప్రదేశ్ నరసరావుపేటకు చెందిన వారుగా గుర్తించారు. వీరు బంగారం అమ్మడానికి వస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Video Top Stories