సీఎం సొంతజిల్లాలో అర్ధరాత్రి అలజడి... గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులపై లాఠీ చార్జ్

సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి  అలజడి రేగింది.

Share this Video

సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి అలజడి రేగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్ట్ సిద్దమైన నేపథ్యంలో ట్రయల్ రన్ కు అధికారులు సిద్దమయ్యారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ లో భూమిని కోల్పోయిన నిర్వాసితులు ఒప్పందం ప్రకారం బెనిఫిట్స్ అందలేదని ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు సిద్దమైన సుమారు 100 మంది భూ నిర్వాసితులను అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ క్రమంలోనే పోలీసులకు, భూనిర్వాసితులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్సడంతో పోలీసులు నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసారు. దీంతో పలువురి తలలు పగలగా చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. 

Related Video