Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్ ఉపఎన్నికకు సర్వం సిద్ధం..!

రేపు జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కి అధికార యంత్రాంగం అన్ని ఏర్పట్లని పూర్తి చేసింది.....

రేపు జరుగనున్న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కి అధికార యంత్రాంగం అన్ని ఏర్పట్లని పూర్తి చేసింది.....పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకి జరుగనుంది....హుజురాబాద్ నియోజకవర్గం లో 306 పోలింగ్ కేంద్రాలని ఏర్పాటు చేసారు.. నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనాలు అనుసరించి నిర్వహించనున్నారు..నియోజకవర్గం లో  144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ కన్నల్ తెలిపాడు..ఉప ఎన్నిక కొసం 421 కంట్రోల్ యూనిట్లు,891 బ్యాలెట్ యూనిట్లు,515 వివి ప్యాడ్ యూనిట్లని వినియోగిస్తున్నారు... మొత్తం 1715 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు..ఈరోజు సాయంత్రం లొగా పోలింగ్ సిబ్బంది తమకి కెటాయించిన సామాగ్రితో తమకి కెటాయించిన పోలింగ్ కేంద్రాలకి చేరుకోనున్నారు..306 పోలింగ్ స్టేషన్ లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు....