Huzurabad Bypoll: అర్ధరాత్రి హైడ్రామా... కారులో పట్టుబడ్డ ఈవీఎం మిషన్లు

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో భాగంగా నిన్న(శనివారం) కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే.

Share this Video

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నికలో భాగంగా నిన్న(శనివారం) కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. అయితే ముగిసన తర్వాత ప్రజాతీర్పు నిక్షిప్తమైన వివి ప్యాట్ల తరలింపు సమయంలో
గోల్ మాల్ జరిగినట్లు ఓ విడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఓ వ్యక్తి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వివి ప్యాట్స్ ను బస్సులోంచి కారులోకి మార్చి తరలిస్తున్న వీడియో అనుమానాలకు తావిస్తోంది.

ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఘటన స్థలానికి చేరుకొని పోలిసులని ప్రశ్నించారు. పోలిసుల తీరుపై ఆయనతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేసారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చూస్తూ ఆందోళనకు దిగారు. 

Related Video