సన్నాసులు, అడ్డగాడిదల్ని కాదు... దమ్ముంటే నువ్వు రా బిడ్డా..: గండ్రకు రేవంత్ వార్నింగ్
భూపాలపల్లి : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు టమాటాలు, కోడిగుడ్లతో దాడిచేసారు.
భూపాలపల్లి : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు టమాటాలు, కోడిగుడ్లతో దాడిచేసారు. హాత్ సె హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ పాదయాత్ర మంగళవారం భూపాలపల్లిలో కొనసాగింది. ఈ క్రమంలో వాహనంపై నిల్చుని రేవంత్ మాట్లాడుతుండగా ఆయనపై కొందరు వ్యక్తులు గుడ్లు, టమాటాలు విసిరారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రేవంత్ పై పడకుండా జాగ్రత్తపడ్డారు.
ఈ దాడిపై రేవంత్ సీరియస్ అయ్యారు. చెప్పులు మోసేటోళ్లో, చెంచాగాళ్లో, సన్నాసులో... క్వాటర్, హాఫ్, ఫుల్లుకో అమ్ముడుపోయే అడ్డగాడిదలను కాదు... దమ్ముంటే నువ్వు రా బిడ్డా అంటూ స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిపై సీరియస్ అయ్యారు. నీయబ్బ... కోడిగుడ్లు, టమాటాలు కాదు నువ్వురా... తాగుబోతు నా కొడుకుల్ని పంపించి వేషాలేస్తున్నావా? అన్నారు. నేను అనుకుంటే నువ్వు కాదు నీ ఇళ్లు కూడా వుండదు కొడకా అంటూ ఎమ్మెల్యే గండ్రకు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.