Cyclone Gulab:కేటీఆర్ ఇలాకాలో ఇదీ పరిస్థితి... వరదనీటితో వాగుల్లా మారిన రోడ్లు

సిరిసిల్ల: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తెలుగురాష్ట్రాలను వణికిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా గత రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. సిరిసిల్ల పట్టణంలో వరదనీరు రోడ్లపైకి చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని కొత్త చెరువు నిండిపోవడంతో నీరు రోడ్లపైకి చేరింది. ఈ వరద నీటిలో ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ ఆటో చిక్కుకుంది. ఇక సిరిసిల్ల పాత బస్టాండ్ ఆవరణ మొత్తం జలమయమై చెరువును తలపిస్తోంది.

Share this Video

Related Video