Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మ స్పెషల్... సరికొత్త అందాలతో మెరిసిపోతున్న కోమటిచెరువు

Oct 13, 2021, 2:07 PM IST

సిద్దిపేట జిల్లాలో మరో అద్భుతం ఆవిషృతమయ్యింది. సిద్దిపేటలో మినీ ట్యాంక్ బండ్ గా పిలుచుకునే కోమటి చెరువు పూలపండగ బతుకమ్మ సందర్భంగా కొత్త అందాలను సంతరించుకుంది. కోమటి చెరువు లో లేజర్ లైట్ అండ్ మ్యూజికల్ ఫౌంటెన్ షో ఏర్పాటుచేసారు. ఇవాళ బతుకమ్మ పండగ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఈ మ్యూజికల్ ఫౌంటెన్ ను ప్రారంభించనున్నారు. లేజర్ షో తో కూడిన మ్యూజికల్ పౌంటెన్ సిద్దిపేట వాసులను కనువిందు చేయనుంది.