Monalisa Viral Girl: Kumbh Mela Beauty Taking Social Media by Storm | Asianet Telugu
అందం అమ్మాయైతే నీలా వుందే అన్నట్లుందే..' ఈ లిరిక్స్ ఈమెకు సరిగ్గా సరిపోతాయి. అందాల ఆరబోత లేదు... మేకప్ అంటే ఏంటో కూడా తెలిసివుండదు... ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డుపైనే ఆమె జీవితం. దుమ్మూ దూళిలోనే ఆమె నిత్యం వుండేది. అయినా ఈ దేవుడే ఆమెను అప్సరసలా తీర్చిదిద్దాడు... కాబట్టి ఇవన్నీ ఆమె చంద్రబింబంలాంటి ముఖారవిందాన్ని ఏం చేయలేకపోయాయి. ఆమె అందానికి కోట్లాదిమంది ఫిదా అయిపోతున్నారు.