
మహా కుంభమేళాలో కత్రినా కైఫ్ పూజలు
Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వీఐపీలు, సినీ, రాజకీయ ప్రముఖులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కుంభ మేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో స్నానం చేసి గంగమ్మకు పూజలు చేశారు.