YS Jaganmohan Reddy Birthday:దేశంలోనే మొదటిసారి... అరుదైన బహుమతి సిద్దంచేస్తున్న వైసిపి ఎమ్మెల్యే
అమరావతి: రేపు (డిసెంబర్ 21 మంగళవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్నూతన రీతిలో బర్త్ డే విషెస్ తెలిపేందుకు సిద్దమయ్యారు.
అమరావతి: రేపు (డిసెంబర్ 21 మంగళవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్నూతన రీతిలో బర్త్ డే విషెస్ తెలిపేందుకు సిద్దమయ్యారు. ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటుచేయిస్తున్నారు ఎమ్మెల్యే. వంద అడుగుల పొడవు, వెడల్పు తో 2d ఆర్కిటెక్చర్ టెక్నాలజీ తో సీఎం జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలి ఆర్ట్ ఫార్మింగ్ తో సీఎం జగన్ చిత్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టిస్ట్ కాంత్ రీషా పేర్కొన్నారు. గత పది రోజుల నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.