పవన్ కల్యాణ్ కు మహిళా వాలంటీర్ల మాస్ కౌంటర్... వైసిపి ఎంపీ ఛాలెంజ్

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Share this Video

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అమ్మాయిల మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలా వాలంటీర్ వ్యవస్థను కించపర్చేలా మాట్లాడారంటూ పవన్ పై మంత్రులు, వైసిపి నాయకులు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. తాజాగా మహిళా వాలంటీర్లు కొందరు పవన్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో అమ్మాయిలు మిస్సింగ్ గురించి కేంద్ర నిఘా వర్గాలకు తెలిసింది... రాష్ట్రంలోనే వున్న పోలీసులు, ప్రభుత్వానికి తెలియలేదా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కాకుండా కేవలం పవన్ కే నిఘా వర్గాలు చెప్పాయా? అని నిలదీసారు. వాలంటీర్లను అవమానించేలా మాట్లాడిన పవన్ వారికి వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా వాలంటీర్లు డిమాండ్ చేసారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ మిథున్ రెడ్డి కూడా పవన్ వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. వాలంటీర్ల వల్ల ఏదేదో జరిగిపోతోందని అంటున్న పవన్ కు ఈ వ్యవస్థని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా? అని మిథున్ నిలదీసారు. వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయటానికే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. 

Related Video