అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ... ఇంద్రకీలాద్రిపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా మూలానక్షత్రంలో(రేపు) అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. 

Share this Video

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా మూలానక్షత్రంలో(రేపు) అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఈ క్రమంలో ఏర్పాట్లన్ని పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు దేవాదాయ శాఖ తరఫున స్వాగతం పలకాలని... చినరాజగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పణ, అంతరాలయంలో పూజలు, అనంతరం వేదపండితుల ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రికి పూర్ణకుంభ స్వాగత ఏర్పాట్లు చేయాలని ఈవోను ఆదేశించారు. 

Related Video