టిప్పు సుల్తాన్ విగ్రహం వివాదం...సోము వీర్రాజు ఎంట్రీతో ప్రొద్దుటూరులో టెన్షన్ టెన్షన్

కడప జిల్లా ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

First Published Jul 27, 2021, 11:14 AM IST | Last Updated Jul 27, 2021, 11:14 AM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న స్థానిక  వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సోమవారం రాత్రి ప్రొద్దుటూరుకు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.     

టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ చేసిన ప్రాంతంలోనే సోము వీర్రాజు ధర్నాకు సిద్దమవుతున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరులో భారీగా పోలీసులను మొహరించి పట్టణాన్ని ఎక్కడికక్కడ దిగ్బంధం చేశారు. పట్టణంలోని రాజీవ్ సర్కిల్, శివాలయం సర్కిల్ లో భారీగా బారీకేడ్ లు ఏర్పాటు చేసి పోలీసులను కూడా పెద్దఎత్తున మోహరించారు. ధర్నాకు దిగకుండా సోము వీర్రాజును నిలువరించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణాన్ని నాలుగువైపులా పహారా కాస్తున్నారు.