Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ పాలనతో 'సంక్షోభంలో సంక్షేమం' ... లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి నిరసన

అమరావతి : ప్రజా సమస్యలపై పోరాటానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంది ప్రతిపక్ష టిడిపి.

First Published Sep 20, 2022, 11:47 AM IST | Last Updated Sep 20, 2022, 11:47 AM IST

అమరావతి : ప్రజా సమస్యలపై పోరాటానికి అసెంబ్లీని వేదికగా చేసుకుంది ప్రతిపక్ష టిడిపి. అసెంబ్లీ లోపలే కాదు బయటకూడా టిడిపి నాయకులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి వివిధ రీతుల్లో నిరసన తెలియజేస్తున్న టిడిపి శాసనసభాపక్షం నాలుగోరోజయిన ఇవాళ సంక్షోభంలో సంక్షేమం పేరిట నిరసన తెలిపింది. వివిధ సంక్షేమ  పథకాల రద్దు నిరసిస్తూ  నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమీపంలోని  ట్రాఫిక్ పీఎస్ వద్ద నిరసన చేపట్టారు. అన్న క్యాంటీన్లు,  పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకాలు రద్దు నిరసిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు, నినాదాలతో కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు.