భవనమెక్కి టిడిపి నేతల వినూత్న నిరసన... పోలీసులతో వాగ్వాదం

అమరావతి : వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపిస్తూ టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. 

Share this Video

అమరావతి : వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపిస్తూ టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ద‌ృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లాలని టిడిపి నిర్ణయించింది. ఇందులో భాగంగానే అసెంబ్లీ వద్ద ఆందోళనకు సిద్దమైన టిడిపి ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ సమీపంలోని ఓ భవనం పైకి ఎక్కిన టిడిపి నాయకులు ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వీరిని బలవంతంగా భవనం పైనుంచి దించి పోలీసులు అరెస్టు చేసారు. ఈ క్రమంలోనే టిడిపి మహిళా నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Related Video