ప్రొక్లెయిన్‌తో వృద్దుడి మృతదేహం తరలింపు: జగన్‌పై లోకేశ్ విమర్శలు (వీడియో)

 శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన దారుణమని, అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు

Share this Video

కరోనా విషయంగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. పారాసిటమాల్ వేసుకుంటే కోవిడ్ 19 తగ్గిపోతుందని జగన్ రెడ్డి చెప్పిన రోజే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘటన దారుణమని, అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు. పలాసలో 70 ఏళ్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని ప్రొక్లెయిన్‌‌తో ఈడ్చుకుంటూ వెళ్తారా అని ఆయన నిలదీశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలన్న లోకేశ్.. జగన్ మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజల్లో ఎలాంటి ఆందోళన ఉంటుందో సీఎం అర్థం చేసుకోవాలని లోకేశ్ సూచించారు. 

Related Video