బ్యాంక్ ఎదుటే దొంగతనం... స్కూటీలో నుండి రూ.4లక్షలు ఛోరీ (సిసి కెమెరా వీడియో)
విజయవాడ: బ్యాంకు నుండి డబ్బులను విత్ డ్రా చేసుకుని బయటకు వచ్చిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బులతో పరారయ్యారు దోపిడీదొంగలు.
విజయవాడ: బ్యాంకు నుండి డబ్బులను విత్ డ్రా చేసుకుని బయటకు వచ్చిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బులతో పరారయ్యారు దోపిడీదొంగలు. గురువారం మధ్యాహ్నం విజయవాడలోని ఓ బ్యాంక్ వద్ద ఈ దొంగతనం చోటుచేసుకుంది. అయితే ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాలకు చిక్కాయి.
నిన్న మధ్యాహ్నం బ్యాంకు ముందు ఆగివున్న స్కూటీలోంచి నగదు చోరీ జరిగింది. స్కూటీ డిక్కిని చాకచక్యంగా తెరిచి రూ.4 లక్షలను అపహరించారు దుండగులు. విజయవాడ బందరు రోడ్డులోని హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకు ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సిసి పుటేజ్ ఆదారంగా దర్యాప్తు చేపట్టారు కృష్ణలంక పోలీసులు.