మరో ఔరంగజేబులా చంద్రబాబు... రాజకీయ నాయకుల్లా జడ్జీలు : మంత్రి నారాయణస్వామి


అమరావతి : టిడిపి జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి నారాయణస్వామి తీవ్రవ్యాఖ్యలు చేసారు.

| Updated : Sep 21 2022, 01:46 PM
Share this Video


అమరావతి : టిడిపి జాతీయాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి నారాయణస్వామి తీవ్రవ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ఔరంగజేబు లాంటోడని... జనాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడమే ఆయనకు తెలుసంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎంగా వుండికూడా సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ది చేసుకోలేదని... అందుకే ఆయనెప్పుడు బోరున ఏడుస్తూ సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తారన్నారు.  కానీ ఈసారి చంద్రబాబు ఆటలు సాగవని... ఆయనపై వైసిపి 60 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని అన్నారు.     

 న్యాయస్థానాల తీర్పులు, జడ్జిలపైనా మంత్రి నారాయణస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జడ్జిలు కూడా రాజకీయ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని... పేదల ఇళ్లకోసం సెంటు భూమి ఇస్తుంటే దానికి స్టే ఇవ్వడమేంటని అన్నారు.  ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు సపోర్ట్ చెయ్యాలని నారాయణస్వామి కోరారు. 
 

Related Video