ఏపీ రాజధాని ప్రాంతంలో బొత్స పర్యటన...
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుంటూరు జిల్లా, తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ఆగిన నిర్మాణ పనులను పరిశీలించారు.
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుంటూరు జిల్లా, తుళ్ళూరు రాజధాని ప్రాంతంలో ఆగిన నిర్మాణ పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు, మంత్రుల బంగ్లాలు, అల్ ఇండియా సర్వీస్ క్వార్టర్స్, ఎన్జీవో, హెచ్.ఓ.డీస్ టవర్స్ ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నేలపాడులో ఎల్ అండ్ టీ, సీఆర్డీఏ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోరాజధాని అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరుస పర్యటనలు సరికొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. శనివారం రాజధాని గ్రామం రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఇన్‌టెక్‌వెల్ పనులు, కరకట్ట రోడ్‌ను పరిశీలించారు. బొత్స, సీఆర్డీఏ కమిషనర్ వచ్చి వెళ్లటంతో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇవాళ కూడా రాయపూడి సమీపంలో బొత్స టూర్ కొనసాగుతోంది.