Video : అక్రమ మద్యాన్ని అడ్డుకోవడానికి పోతే..పోలీసుకు తీవ్ర గాయాలు...
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు.
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. టూవీలర్ మీద అక్రమమద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను పట్టుకోబోగా తప్పించుకునే ప్రయత్నంలో బండిని పోలీసుల మీదికి నడిపించారు. దీంతో తిక్కయ్య అనే పోలీస్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్రమమద్యం తరలిస్తున్న ఇద్దరిలో ఒకరు పారిపోగా మరొకరిని పట్టుున్నారు. వీరినుండి లక్షల విలువ చేసే నాలుగు మద్యం కేసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.