
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్... శుక్ర, శనివారాలు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖపట్నం : మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ తెలిపారు.
విశాఖపట్నం : మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు వుంటాయని పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, దేశ విదేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు విశాఖకు రానున్న నేపథ్యంలో 2500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి తెలిపారు. ఈ క్రమంలోనే సమ్మిట్ జరిగే ఏయూ నుండి విమానాశ్రయం వరకు, బీచ్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపులు వుంటాయని... వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సిపి సూచించారు. ఇక శుక్ర, శనివారాలు బీచ్ కు వెళ్లేవారు తమ వాహనాలను ఏపీఐఐసి గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలని సిపి శ్రీకాంత్ సూచించారు.