పొలంనుండి వెడుతుంటే వరిగడ్డిలో మంటలు...ఒకరు సజీవదహనం

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు గాయాల పాలయ్యారు.

| Updated : Jan 30 2020, 04:10 PM
Share this Video

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో కరెంట్ షాక్ తో ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరు గాయాల పాలయ్యారు. పొలం నుండి వరిగడ్డి వేసుకుని వస్తుంటే  ట్రాక్టర్ పై భాగంలో 11 కె.వి విద్యుత్ వైరు తగిలింది. పొలం మధ్యలో నుండి వెళుతున్న 11 కె.వి విద్యుత్ వైర్లు ట్రాక్టర్ డ్రైవర్ గమనించలేదు దీంతో విద్యుత్ ఘాతానికి వరిగడ్డిలో మంటలుచెలరేగాయి. వరి గడ్డి పైన కూర్చున్న ముగ్గురు వ్యక్తుల్లో మార్కపూడి గురవయ్య అనే రైతు కూలీ సజీవదహనం కాగా యేసయ్య,శివ అనే మరో ఇద్దరు రైతు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.

Related Video