ఏపీకి మూడు రాజధానులు : నిరాహారదీక్షలూ, రాస్తారోకోలు...రోడ్లపైనే వంటావార్పులు...
ఏపీకి మూడు రాజధానులు అమరావతి పరిసర గ్రామాల ప్రజలు రెండో రోజైన శుక్రవారం నాడు రైతులు మహా ధర్నాలకు పిలుపు నిచ్చారు.
ఏపీకి మూడు రాజధానులు అమరావతి పరిసర గ్రామాల ప్రజలు రెండో రోజైన శుక్రవారం నాడు రైతులు మహా ధర్నాలకు పిలుపు నిచ్చారు. రోడ్లపైనే వంటలు చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో రోడ్డుపైనే వంటావార్పు చేశారు. వెలగపూడిలో రైతులు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. తుళ్లూరులో ఉదయం ఏడు గంటల నుండే వాహనాల రాకపోకలను రైతులు అడ్డుకొన్నారు. తుళ్లూరు తులసి సెంటర్‌లో రైతులు వంటా వార్పు చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలను దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 15 మంది ఎస్ఐలు, 32 మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళతో బందోబస్తు ఏర్పాటు చేశారు.