Tirupati Rains: వాయుగుండం ఎఫెక్ట్... భారీ వర్షాలతో తిరుమల దేవాలయం జలదిగ్బందం
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో కుండపోత వర్షానికి తడిసిముద్దయ్యింది. అలాగే తిరుమలలో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. తిరుమల కొండపై వర్షం కురిసి వరదనీరు దిగువకు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కపిలేశ్వర తీర్థం వద్ద వరదనీరు ప్రమాదకరరీతితో కిందుకు దూకుతోంది.ఇక వాహనాలు ప్రయాణించే ఘాట్ రోడ్డుతో పాటు నడకమార్గంలో వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ రెండు మార్గాలను కూడా మూసివేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. వర్ష తీవ్రత తగ్గినతర్వాత కొండపైకి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో కుండపోత వర్షానికి తడిసిముద్దయ్యింది. అలాగే తిరుమలలో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. తిరుమల కొండపై వర్షం కురిసి వరదనీరు దిగువకు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కపిలేశ్వర తీర్థం వద్ద వరదనీరు ప్రమాదకరరీతితో కిందుకు దూకుతోంది. ఇక వాహనాలు ప్రయాణించే ఘాట్ రోడ్డుతో పాటు నడకమార్గంలో వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ రెండు మార్గాలను కూడా మూసివేస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు. వర్ష తీవ్రత తగ్గినతర్వాత కొండపైకి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.