
కువైట్ నుండి విశాఖకు చేరుకున్న 114 మంది తెలుగువారు..
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఉన్న తెలుగు వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో మూడవసారి ఈరోజు సాయంత్రం కువైట్ నుండి విశాఖ తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో ఉన్న తెలుగు వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవతో మూడవసారి ఈరోజు సాయంత్రం కువైట్ నుండి విశాఖ తీసుకువచ్చారు. బుధవారం రాత్రి కువైట్ ఎయిర్లైన్స్ విమానంలో 114 మంది తెలుగువారు విశాఖ చేరుకున్నారు. వీరందరికీ స్క్రీనింగ్ టెస్ట్ లు,
ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ చెకింగ్ చేయటానికి సుమారు ఒక గంట సమయం పట్టింది. కువైట్ నుండి విశాఖ చేరుకున్న ప్రయాణికులను విశాఖ పోర్టు సీతారామ కళ్యాణ మండపం తీసుకువెళ్లారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం వారివారి జిల్లాల్లోని ప్రభుత్వ మరియు పెయిడ్ కోరం ట్రైన్ కు తరలించారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేసింది.