chaloramatheertham: పోలీస్ వలయాన్ని దాటుకుని ఆర్చి వద్దకు సోము వీర్రాజు

విజయనగరం: బిజెపి, జనసేన రామతీర్థం యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోంది. 

First Published Jan 5, 2021, 11:55 AM IST | Last Updated Jan 5, 2021, 11:55 AM IST

విజయనగరం: బిజెపి, జనసేన రామతీర్థం యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోంది. ఇప్పటికే అనుమతి లేదంటూ ముఖ్య నాయకులకు ముందస్తు నోటీసులు, హౌస్ అరెస్టులు చేయడంతో పాటు విశాఖ, విజయనగరం బిజెపి కార్యాలయాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. అయితే ఈ పోలీసులు వలయాలను దాటుకుని రామతీర్థం ఆర్చి వద్దకు బిజేపి నేతలు సోము‌ వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, బిజెవైఎం అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ చేరుకున్నారు. ప్రభుత్వం తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన సోము‌ వీర్రాజు రామతీర్థం యాత్ర ను అనుమతి లేదంటూ అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.జగన్మోహన్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే హిందూ ఆలయాల పై దాడులను నియంత్రించాలని సూచించారు.దేవాలయాలపై దాడులను టిడిపి రాజకీయ కోణంలో‌ చూస్తే.. మేము హిందువులు మనోభావాల కోసం పోరాడుతున్నాయన్నారు సోము వీర్రాజు.