
అంబటి అరెస్టు రాజకీయ కక్షసాధింపే
అక్రమ కేసులతో అరెస్టు చేసి ఇబ్బంది పెట్టినంతమాత్రాన ప్రశ్నించడం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వమని వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని అంబటి ఇంటిని పరిశీలించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఎప్పటికీ ఆపలేరని స్పష్టం చేశారు.