జంతర్ మంతర్ వద్ద ధర్నాకు సిద్దమైన ఏపీ రైతులు... డిమాండ్లివే
విజయవాడ: రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్దమయ్యారు
విజయవాడ: రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్దమయ్యారు ఏపీ రైతు సంఘాల నాయకులు. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్ఢినేషన్ కమిటి పిలుపు మేరకు ఏపీ రైతు సంఘ ప్రతినిధులు, వామపక్ష నేతలు డిల్లీకి పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి 15 మంది సభ్యులు, రైతుసంఘ ప్రతినిధులతో కూడిన బృందం డిల్లీకి బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమితి కన్వీనర్ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర రావు నాయకత్వంలో డిల్లీలో జరిగే రైతుల ధర్నాలో పాల్గొననున్నారు. వ్యవసాయ చట్టాలపైనే కాకుండా విశాఖ ఉక్కు పరిరక్షణ, పోలవరం నిర్వాసితులకు పరిహారం వంటి రాష్ట్ర సమస్యలపైనా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా దిల్లీలో గళం విప్పనున్నారు.