AP Elections:కుప్పంలో జోరుగా... విశాఖ, కొండపల్లిలో మాత్రం మందకోడిగా పోలింగ్

అమరావతి:  గతంలో వివిధ కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థలకు తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి.

Share this Video

అమరావతి: గతంలో వివిధ కారణాలతో వాయిదాపడ్డ స్థానిక సంస్థలకు తాజాగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్, పార్టీల ప్రచారం ముగిసి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో కూడా పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ గెలుపుకోసి టిడిపి, వైసిపి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. దీంతో ఓటేయడానికి భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్నారు. ఇక విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్లో 31, 61వార్డులో కూడా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7గంటల నుండి పోలింగ్ ప్రారంభమవగా 10గంటలవరకు 31 వ వార్డులో 6శాతం, 61వ వార్డులో 9శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక కృష్ణాజిల్లా కొండపల్లిలో కూడా పోలింగ్ జరుగుతోంది. అయితే ఇక్కడ పోలింగ్ మందకోడిగా సాగుతోంది.

Related Video