Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అనుచరుల దాడి విజువల్స్

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టిడిపి జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు.

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టిడిపి జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాసం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు ఇంటివద్దకు టిడిపి శ్రేణులు కూడా భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే టిడిపి, వైసిపి శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. 

ఎమ్మెల్యే జోగి రమేష్ పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ళదాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. టీడీపీ, వైసిపి నాయకులు పరస్పరం తోపులాటకు దిగి రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ రాళ్ల దాడిలో పలువురు నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తలు వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా  డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే జోగి రమేశ్, వైసీపీ నేతలు ఉండవల్లిలోని బాబు నివాసం వద్దకు భారీ కాన్వాయ్‌తో వస్తున్న వీడియోలను డీజీపీ కార్యాలయం విడుదల చేసింది.