అర్హత గల ప్రతి ఒక్కరికీ అండగా వైసిపి సర్కార్... రూ.590 కోట్లు విడుదలచేసిన జగన్

తాడేపల్లి :  సంక్షేమ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలనేదే వైసిపి ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

First Published Dec 27, 2022, 1:25 PM IST | Last Updated Dec 27, 2022, 1:25 PM IST

తాడేపల్లి :  సంక్షేమ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ అందించాలనేదే వైసిపి ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకే పొరపాటున అర్హులెవరికైనా ఏ కారణం చేతయినా పథకాలు అందకుంటే అలాగే వదిలిపెట్టడంలేదని... వారికోసమే నవరత్నాలు ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో వచ్చే ఆరోపణలను పాజిటివ్ గా తీసుకోవాలని... నిజం వుంటే న్యాయం జరిగేలా చూడాలని అధకారులకు సీఎం జగన్ ఆదేశించారు. 

నవరత్నాల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్నం జగనన్న చేదోడు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్సార్‌ కాపునేస్తం సహా పలు పథకాలను అమలుచేస్తోంది. అయితే అర్హతలుండి ఈ పథకాలు అందని 2,79,065 మంది లబ్ధిదారులకు రూ.590.91 కోట్లను ఇవాళ ముఖ్యమంత్రి విడుదల చేసారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసారు.