వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే (వీడియో)

భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి (ap cm) వైఎస్‌ జగన్‌ (ys jagan mohan reddy) శనివారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే (aerial survey) నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

First Published Nov 20, 2021, 4:08 PM IST | Last Updated Nov 20, 2021, 4:08 PM IST

ఏపీని గత మూడు రోజులుగా భారీ వర్షాలు (heavy rains) అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి (ap cm) వైఎస్‌ జగన్‌ (ys jagan mohan reddy) శనివారం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే (aerial survey) నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, జరిగిన నష్టంపై సీఎం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అలాగే పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున సాయం అందించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించిన సీఎం జగన్‌.. ఏరియల్‌ సర్వే నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా, ఏరియల్‌ సర్వేలో భాగంగా కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సీఎం గన్నవరం తిరుగు పయనమయ్యారు.