ఏపీలో అగ్రిగోల్డ్ తరహా స్కామ్... అమాయకులను బురిడీ కొట్టించిన వెల్పేర్ సంస్థ

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రిగోల్డ్ తరహాలోనే మరో ఘరానా మోసం బయటపడింది. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా విడతల వారిగా భారీ డబ్బులు వసూలుచేసి మోసానికి పాల్పడిందో వెల్ఫేర్ సంస్థ. 

First Published Dec 28, 2022, 10:46 AM IST | Last Updated Dec 28, 2022, 10:46 AM IST

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లో అగ్రిగోల్డ్ తరహాలోనే మరో ఘరానా మోసం బయటపడింది. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా విడతల వారిగా భారీ డబ్బులు వసూలుచేసి మోసానికి పాల్పడిందో వెల్ఫేర్ సంస్థ. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన అమాయకులను డిపాజిట్ చేసే డబ్బులకు రెండు మూడింతలు తిరిగిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడింది సంస్థ. వాయిదా పద్దతుల్లో డబ్బులు చెల్లిస్తే అభివృద్ధి చేసిన ఫ్లాట్ ఇస్తామని నమ్మించి అమాయకులను బుట్టలో వేసుకుంది వేల్ఫేర్ సంస్థ. దీంతో వేల మంది ఖాతాదారులు లక్షల్లో డబ్బులు సదరు సంస్థకు చెల్లించారు. అయితే గడువు పూర్తయినా అటు ప్లాట్లు గానీ ఇటు డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగివ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 
పొదుపు పేరుతో లక్షల రూపాయలు దోచుకున్న వెల్ఫేర్ గ్రూప్ ఎండి మల్లా.విజయ్ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని... వెంటనే తమ డబ్బులు తిరిగి చెల్లించేలా చూడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.