Asianet News TeluguAsianet News Telugu

అర్ధరాత్రి విద్యుత్ వైర్లు తెగిపడి... నిద్రలోనే ఆరుగురి ప్రాణాలు బలి

గుంటూరు రేపల్లె మండలం లంకెవాని దిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

First Published Jul 30, 2021, 1:38 PM IST | Last Updated Jul 30, 2021, 1:38 PM IST

గుంటూరు రేపల్లె మండలం లంకెవాని దిబ్బ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ రొయ్యల చెరువు దగ్గర పనిచేస్తున్న ఒడిషాకు చెందినవారు ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ గురయ్యారు.  గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్ గా పోలీసులు గుర్తించారు.