చిత్తూరు: భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన తండ్రే తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రోజుల తరబడి కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. తన బాధను కూతురు ఎవరికీ చెప్పుకోలేక లోలోన కుమిలిపోతూ వస్తోంది. 

తాజాగా సంక్రాంతి పర్వదినం రోజు కూడా అదే పనికి ఒడిగట్టడంతో కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దామరకుప్పం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు ఇద్దరు భార్యలు. అతను కూలీ పనులు చేస్తుంటాడు. 

Also Read: కూతురిపై తండ్రి అత్యాచారం: గొలుసులతో కట్టేసి మరీ, అఘాయిత్యం

పెద్ద భార్యకు ఇద్దరు కుమారులు. రెండో భార్యకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. వారిలో 12 ఏళ్ల కూతురు సమీప పట్టణంలో ఆరో తరగతి చదువుతోంది. పిల్లలు హాస్టల్స్ లో ఉండడం వల్ల తల్లులు కూడా పనులకు వెళ్తున్నారు. 

బాలిక సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా తండ్రిని ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. దాంతో బాలిక తీవ్ర భయందోళనలకు గురవుతోంది. తాజాగా పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన బాలికపై ఈ నెల 14వ తేదీన తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

Also Read: కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్ కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి వైద్యశాలకు పంపించాడు. 

సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఈ నెలలోనే హైదరాబాదులో అటువంటి సంఘటన ఒకటి జరిగింది. తాగిన మైకంలో నేరేడ్ మెట్టలో ఓ తండ్రి కూతురిపై అత్యాచారం చేశాడు. 

Also Read: ఐదేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం