దేశవ్యాప్తంగా దిశ అత్యాచారం, హత్యపై రగిలిపోతున్నప్పటికీ ఆడపిల్లలపై అత్యాచారాలు ఆగడం లేదు. రోడ్డుపైనే కాకుండా ఇంట్లోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా కన్నబిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్నకూతురుపై అత్యాచారం చేశాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ జలోర్ జిల్లాలో ఓ వ్యక్తి తన 17 ఏళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను తన భార్యపై వేధింపులకు పాల్పడటంతో ఏడేళ్ల క్రితమే భర్త నుంచి విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకుంది.

Also Read:రేప్ చేశారని ఫిర్యాదు: పోలీసుల నిర్లక్ష్యం, ఉరేసుకున్న బాధితురాలు

ఈ క్రమంలో అతనికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా కుమార్తె వరకు చేరడంతో ఆమె తండ్రిని నిలదీసింది... దీంతో ఆగ్రహానికి గురైన అతను ఆమెను చైన్లతో కట్టేసి బంధించాడు.

అంతేకాకుండా కన్న కూతురు అనే సంగతిని కూడా మరచిపోయి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం తండ్రి బారి నుంచి తప్పించుకున్న యువతి మేనమామ ఇంటికి చేరుకుంది.

ఆయన సహాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి మరో మహిళతో సన్నిహితంగా ఉంటోందని, అది తాను చూసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. దీనిపై తాను నిలదీసినప్పటి నుంచి వేధిస్తున్నాడని వాపోయింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మరోవైపు అత్యాచారానికి గురైన ఓ యువతి అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే...ఒడిషాకు చెందిన ఓ 23 ఏళ్ల మహిళా లెక్చరర్‌పై ఆమె దూరపు బంధువు అక్టోబర్ 20న అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు అదే నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో శనివారం రాత్రి సదరు లెక్చరర్ తన హాస్టల్ గదిలో విగతజీవిగా పడివుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆమె మరణానికి కారణమైన ఆరుగురిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read:చిన్నారిపై అత్యాచారయత్నం: నిందితుడిని చితకబాది, నగ్నంగా ఊరేగించిన జనం

ఈ ఘటనపై మయూర్‌భంజ్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... లెక్చరర్ మరణానికి సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు జార్పోఖారియా పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ శరత్ కుమార్ మహాలిక్‌ బదిలీ చేయంతో పాటు సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రశాంత్ స్వైన్‌ను సస్పెండ్ చేశారు.