హైదరాబాద్‌: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంపై నమోదైన కేసులో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురికి నోటీసులు పంపిన పోలీసులు గురువారం మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. 

దాదాపు 60 యూట్యూబ్‌ లింకులను షర్మిల తన ఫిర్యాదులో పొందుపరిచారు. వీటి ఆధారంగా విచారణ ప్రారంభించిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఆయా యూట్యూబ్‌ ఛానల్స్‌ ఎవరికి చెందినవో తెలుసుకుని విచారణకు పిలుస్తున్నారు. గురువారం వరకు మొత్తం 15 మందిని విచారించారు. 

ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. వీరికి సీఆర్పీసీ 41(ఏ) సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు. అభియోగపత్రాల దాఖలు అనంతరం వీరు కోర్టుకు హాజరై విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారుల్ని గుర్తించాలంటే ప్రాథమికంగా ఆయా అంశాలతో కూడిన వీడియోలను సృష్టిస్తూ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలు కోరుతూ యూట్యూబ్‌ యాజమాన్యానికి, గూగుల్‌కు లేఖలు రాశారు. 

సంబంధిత వార్తలు

షర్మిల పిల్లలపై ప్రమాణం చేసింది, ఇలాగేనా..: చంద్రబాబుపై బుగ్గన ఫైర్

షర్మిల-ప్రభాస్ కేసు.. ఆరుగురి అరెస్ట్

షర్మిల-ప్రభాస్ కేసు: 5 యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల విచారణ

షర్మిల ఫిర్యాదు: యూట్యూబ్, గూగుల్‌లకు లేఖ

ప్రభాస్ తో అఫైర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిలకు రాములమ్మ బాసట

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

దగుల్బాజీ, గజ్జి కుక్కలు: వైఎస్ షర్మిల ఇష్యూపై చిన్నికృష్ణ

బాబుకు అలవాటే, చిరుపై లాగానే వైఎస్ షర్మిలపై..: పోసాని

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!