దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలపై వచ్చిన ఆరోపణలకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వివరణ ఇచ్చారు. టీడీపీ, జనసేన నేతలు తనను సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారని, హీరో ప్రభాస్ తో తనకు అక్రమ సంబంధం అంటగడుతున్నారంటూ షర్మిల ఈ రోజు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

కాగా.. ఆమె ఆరోపణలపై బుద్ధా వెంకన్న స్పందించారు. షర్మిలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ అధినేత చంద్రబాబు ఇలాంటివాటిని ఎప్పుడూ ప్రోత్సహించరని చెప్పారు. ఒక ఆడపిల్లని కించపరిచే విధంగా ఎవరు కామెంట్స్ చేసినా శిక్షించాల్సిందేనని అన్నారు. ఈ తప్పు ఎవరు చేసినా.. తప్పేనని ఆయన వివరించారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. జగన్‌ను రాజకీయంగా విమర్శించాం గానీ.. షర్మిళను ఏనాడూ ప్రస్తావించలేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

read more news

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల